: నిత్యం నాలుగు కేజీల బంగారం ధరించి తిరిగే నాకు.. 10 కోట్లు పెద్ద లెక్క కాదు!: కువైట్ ప్రవాస భారతీయుడు

కువైట్ లో ప్రవాసాంధ్రులకు పది కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి తిరుపతి వచ్చేశాడంటూ ఓ కథనం వెలువడ్డ సంగతి తెలిసిందే. దీనిపై ఆయన వివరణ ఇస్తూ, తానెవరినీ మోసం చేయలేదని తెలిపారు. తననే కొందరు మోసం చేశారని, ప్రస్తుతం తాను సెలవులపై వచ్చానని ఆయన అన్నారు. తిరుపతిలో 12 వినాయక మండపాల దగ్గర నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు. తనపై కుట్రపూరితంగా ఇలాంటి ప్రచారం జరుగుతోందని ఆయన వాపోయారు.

నిత్యం ఒంటిపై నాలుగు కేజీల బంగారం ధరించి తిరిగే తనకు పది కోట్ల రూపాయలు పెద్ద లెక్కలోని అంశం కాదని ఆయన చెప్పారు. కువైట్ లో తెలుగు ప్రజలకు ఎంతో మందికి తాను సాయం చేశానని ఆయన చెప్పారు. కువైట్ లో తెలుగు ప్రజలు నిర్వహించే ప్రతి కార్యక్రమం వెనుక తాను ఉన్నానని, తన ప్రతిష్ఠను చూసి ఓర్వలేని కొంత మంది కుట్రపూరిత కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌ లోని ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి 1.6 మిలియన్ కువైట్ దినార్లు (సుమారు 34 కోట్ల రుపాయలు) తీసుకుని తనను మోసగించాడని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయనను గాలిస్తున్నానని ఆయన చెప్పారు. అంతకు ముందు కేరళకు చెందిన ఒక వ్యక్తి మోసం చేస్తే దాని నుంచి తేరుకుని నిలదొక్కుకున్నానని ఆయన చెప్పారు. 

More Telugu News