సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

01-09-2017 Fri 07:41
*  ఈ రోజు విడుదలవుతున్న 'పైసా వసూల్' చిత్రంలో నాయికగా నటించిన అందాల శ్రియ త్వరలో తమిళంలో సైకో థ్రిల్లర్ కథాంశంతో రూపొందే చిత్రంలో నటిస్తుంది. ఈ విషయం గురించి చెబుతూ, ఈ చిత్రానికి ఇరవై మూడేళ్ల కుర్రాడు దర్శకత్వం వహిస్తాడని శ్రియ తెలిపింది. ఈ చిత్రంలో తాను సరికొత్త పాత్రలో కనిపిస్తానని చెప్పింది.
*  శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహానుభావుడు' చిత్రం టీజర్ ను నేటి నుంచి 700 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ టీజర్ సోషల్ మీడియాలో 50 లక్షల డిజిటల్ వ్యూస్ ను పొందింది. విజయదశమికి విడుదలయ్యే ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించింది.
*  తెలుగులో భారీ విజయాన్ని నమోదు చేసి, నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్న 'అర్జున్ రెడ్డి' చిత్రం తమిళ రీమేక్ హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. యంగ్ హీరోలు శింబు, విజయ్ సేతుపతి ఇద్దరూ ఈ చిత్రం రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.