: చేతనైతే వర్షాలను ఆపండి చూస్తా: మీడియాపై విరుచుకుపడిన ఉద్ధవ్ థాక్రే

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు చుట్టుముట్టడం, ఆపై ప్రజా జీవనం అతలాకుతలమై, రైళ్లు, విమానాలు, రవాణా వ్యవస్థ నిలిచిపోవడం తదితరాలపై మీడియా ప్రశ్నిస్తున్నవేళ, నగరపాలక సంస్థను ఏలుతున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మీడియాపై రుసరుసలాడారు. వర్షాలపై ఎంసీజీఎం (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై) మీడియా సమావేశాన్ని నిర్వహించగా, ఇంత భారీ వర్షాలకు కారణం నదులు, నాలాల ఆక్రమణలేనని, వరదలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని మీడియా ప్రస్తావించగా, థాక్రేకు కోపం వచ్చింది.

'చేతనైతే మీరు వర్షాలను ఆపండి, నేను చూస్తా'నంటూ ఆయన విరుచుకుపడ్డారు. "నేనేం చేయాలో మీరు చెప్పండి. వర్షాలను ఎలా ఆపాలో చెబితే చేస్తాను. గతంలో మేము ప్రజలకు మంచి చేశాం కాబట్టే మరోసారి అధికారంలోకి వచ్చాం" అని ఆయన అన్నారు. నీరు నిలువకుండా చూసేందుకు ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు. ఇక ఈ కటువు వ్యాఖ్యలపై బీజేపీ నగర అధ్యక్షుడు ఆశిష్ షేల్కర్ స్పందిస్తూ, థాక్రే మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News