prabhas: 'సాహో'లో ప్రభాస్ పాత్ర ఏంటన్నది తెలిసిపోయింది!

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 'సాహో' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రధానమైన పాత్రను పోషించనున్నాయని అంటున్నారు. అండర్ వాటర్ లోను హాలీవుడ్ స్థాయి ఫైట్స్ వున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ పోషిస్తోన్న పాత్ర ఏమిటనే ఆసక్తి ఆయన అభిమానుల్లో నెలకొంది.

ఈ సినిమాలో ప్రభాస్ హై ప్రొఫైల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. పర్సనాలిటీ పరంగా .. లుక్స్ పరంగా ఈ పాత్రకి ప్రభాస్ కరెక్ట్ గా సరిపోతాడని ఎవరైనా చెప్పగలరు. ఈ పాత్రలో ఆయన చేసే సాహసాలు అదరగొట్టేస్తాయని అంటున్నారు. ఇక శ్రద్ధా కపూర్ తో ప్రభాస్ రొమాన్స్ మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రభాస్ కి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. కంటెంట్ పై గల నమ్మకంతో ఈ సినిమాను జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నారు.    

More Telugu News