: పాత వ్యూహం, పాత జట్టుతోనే టీమిండియా.. మలింగ కెప్టెన్సీలో సరికొత్త వ్యూహంతో శ్రీలంక

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో నేడు నాలుగో వన్డే జరగనుంది. మిగిలిన రెండు వన్డేల్లో కూడా విజయం సాధించి టెస్టు సిరీస్ లాగే క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో ఈ వన్డేలో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక భావిస్తోంది. టీమిండియా గత మూడు వన్డేల్లో దిగిన జట్టుతోనే బరిలో దిగనుండగా, శ్రీలంక మాత్రం కెప్టెన్ ను మార్చింది. మలింగకు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. సీనియర్ ఆటగాడైన మలింగ సారథ్యంలో విజయం సాధించాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టులో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా సిరీస్ తో శ్రీలంక క్రికెట్ పీకల్లోతు కష్టాలు, సంక్షోభంలో మునిగిపోయింది. సొంత అభిమానులే జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం పట్ల ఆ దేశ క్రికెట్ దిగ్గజాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాస్ గెలిస్తే తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాలని లంక భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ ఉత్కంఠగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

More Telugu News