: రానా టీవీ షోలో అదరగొట్టేసిన బాలయ్య.. ఆశ్చర్యపోయిన రానా.. మీరూ చూడండి!

జెమినీ టీవీలో ప్ర‌సారం అవుతున్న 'నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా' షోలో తాజాగా న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ పాల్గొన్నారు. ‘పైసా వ‌సూల్’ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ షోలో పాల్గొన్న ఈ ఇరువురు ఎంత‌గానో అల‌రించారు. ఇక బాల‌కృష్ణ అయితే 25 ఏళ్ల కుర్రాడిలా చేసిన‌ డ్యాన్సులు, అల్ల‌రి అంతా ఇంతా కాదు.

రానాకు బాలయ్య సరదాగా ఇచ్చిన వార్నింగ్, రానా నవ్వలేక అలసిపోయిన తీరు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. చివ‌రికి రానాపైకి ఎక్క‌డానికి కూడా బాల‌కృష్ణ  ప్ర‌య‌త్నించాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను రానా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ షో ఎంత స‌రదాగా సాగిపోయిందో అని పేర్కొని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. బాల‌య్య హుషారుని మీరూ చూడండి...

More Telugu News