ajith: రూట్ మార్చేస్తోన్న అజిత్ .. చారిత్రక నేపథ్యంతో సినిమా!

అజిత్ తాజా చిత్రంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వివేగం' తమిళంలో భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడు శివ .. అజిత్ కలిసి చేసిన ఈ సినిమా, వాళ్లకి హ్యాట్రిక్ హిట్ ను తెచ్చి పెట్టింది. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపించిందని అభిమానులు చెప్పుకున్నారు.

 ఈ సినిమా తరువాత అజిత్ .. శివ కలిసి మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ సారి చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా చేద్దామని శివ అంటే .. అందుకు అజిత్ ఓకే చెప్పాడట. దాంతో చారిత్రక నేపథ్యం కలిగిన కథను సిద్ధం చేసే పనిలో శివ వున్నాడని అంటున్నారు. భారీ బడ్జెట్ లో ఈ సినిమా వుండొచ్చని చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను శివ పూర్తి చేసేలోగా, అజిత్ మరో దర్శకుడితో సినిమాను పూర్తి చేయనున్నట్టు సమాచారం.      

More Telugu News