: ఆస్ట్రేలియాకు పెను షాక్... తొలి టెస్టులో మట్టికరిపించిన బంగ్లాదేశ్!

ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ జట్టు మంచి విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో 20 పరుగుల తేడాతో గెలిచి, చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సొంత గడ్డపై ఆడుతుండటం బంగ్లాకు ప్లస్ పాయింట్ అయింది. షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 244 పరుగులకే కుప్పకూలింది.

 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను షకీబ్ అల్ హసన్ తన అద్భుత బౌలింగ్ తో దెబ్బతీశాడు. మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లతో, హసన్ మిరాజ్ రెండు వికెట్లతో రెచ్చిపోవడంతో ఆ జట్టు విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 260 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 217 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆపై రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా జట్టు 221 పరుగులకు కుప్పకూలగా, ఆపై విజయమే లక్ష్యంగా ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఓపెనర్ వార్నర్ 112 పరుగులు చేసి రాణించినప్పటికీ, మిగతా ఆటగాళ్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది.

More Telugu News