pavan: బర్త్ డే నాడు పవన్ సర్ ప్రైజ్ చేస్తాడట!

త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్ పరిశీలనలో వున్నట్టుగా చెబుతున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రిందట ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆ తరువాత ఎందుకనో గాని ఆ పోస్ట్ ను తొలగించారు.

దాంతో సెప్టెంబర్ 2న ఫస్టు లుక్ ను రిలీజ్ చేసే అవకాశం లేదని అనుకున్నారు. కానీ ఆ రోజున ఫ్యాన్స్ ను పవన్ సర్ ప్రైజ్ చేయనున్నట్టు మళ్లీ ఊరిస్తున్నారు. ఆ రోజున ఫస్టులుక్ ను వదులుతామనే వార్త ముందుగానే చెప్పారు గనుక, టీజర్ ను వదలడమే సర్ ప్రైజ్ అయ్యుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.   

More Telugu News