raviteja: శ్రీను వైట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రవితేజ!

తెలుగులో అగ్రదర్శకులలో ఒకరుగా శ్రీను వైట్ల కొంతకాలం పాటు తన హవాను కొనసాగించారు. ఆ తరువాత ఆయనకి వరుస పరాజయాలు ఎదురుకావడం మొదలైంది. 'ఆగడు', 'బ్రూస్ లీ', 'మిస్టర్' సినిమాలు ఆయనకు పూర్తి నిరాశను కలిగించాయి. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి కొంతమంది హీరోలు వెనుకాడుతున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల .. రవితేజను కలిసి ఒక కథను వినిపించాడట. ఆ కథ తనకి బాగా నచ్చడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి నల్లమలుపు బుజ్జి నిర్మాతగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. గతంలో రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన 'వెంకీ', 'దుబాయ్ శీను' మంచి విజయాలను సాధించాయి. వీళ్ల కాంబినేషన్లో రానున్న మూడవ సినిమా కూడా హిట్ జాబితాలో చేరుతుందేమో చూడాలి.  

More Telugu News