: ఉత్తర కొరియా చర్యల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన చైనా

తన మిత్ర దేశమైన ఉత్తర కొరియా చర్యల పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. జపాన్ భూభాగం మీదుగా క్షిపణులను ప్రయోగించడంపై స్పందించిన చైనా... కొరియా ద్వీపకల్పంలో పరిస్థితులు మరింత దిగజారాయని తెలిపింది. ఉత్తర కొరియా చర్యల వెనుక అమెరికా, దక్షిణ కొరియాల తప్పు కూడా ఉందని అభిప్రాయపడింది. కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు కృషి చేస్తాయని ఆశిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు వరుసగా చేపడుతున్న సంయుక్త సైనిక విన్యాసాలను ఆయన తప్పుబట్టారు. ఉత్తర కొరియాపై ఒత్తిడి తీసుకురావడం, ఆంక్షలు విధించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని... శాంతి చర్చలు జరగాలని ఆయన సూచించారు.

More Telugu News