: ఉత్త‌ర‌కొరియా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలపై ర‌ష్యా, జ‌పాన్ ఆగ్ర‌హం

ప్ర‌పంచ దేశాల నుంచి ఒత్తిడి వ‌స్తున్న‌ప్ప‌టికీ త‌న తీరు మార్చుకోని ఉత్త‌ర‌కొరియా మ‌రోసారి న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్‌ లు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఆ దేశం చేస్తోన్న‌ ప్రయోగాలపై రష్యా ఆందోళన వ్య‌క్తం చేసింది. ర‌ష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గె ర్యాబ్కో ఈ విష‌యంపై మాట్లాడుతూ... తీవ్రంగా మారుతున్న పరిస్థితులను చూస్తుంటే చాలా ఆందోళనగా ఉందని అన్నారు. ఈ అంశంపై జపాన్‌ అధ్యక్షుడు షింజో అబే మాట్లాడుతూ... ఇది తమ దేశానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాలు ఉత్త‌ర కొరియా తీరును ఖండిస్తున్నప్పటికీ ఆ దేశం మాత్రం ఇటువంటి చ‌ర్య‌లకు పాల్ప‌డుతోంద‌ని మండిప‌డ్డారు. 

More Telugu News