: గోద్రా అల్లర్లలో దెబ్బతిన్న మసీదుల మరమ్మతులకు నిధులు ఇవ్వక్కర్లేదు!: సుప్రీంకోర్టు

2002లో జరిగిన మతకల్లోలాలు, గోద్రా అల్లర్లలో భాగంగా ధ్వంసమైన మసీదుల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలిచ్చింది. చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఇచ్చిన తొలి రూలింగ్ ఇదే. జస్టిస్ పీసీ పంత్ తో కలసి గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణ జరిపిన కోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది.

మతపరమైన నిర్మాణాల మరమ్మతులు, పునరుద్ధరణకు ప్రభుత్వ నిధులు వెచ్చించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అపీలుకు వెళ్లగా, నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, ధ్వంసమైన నివాస స్థలాలు, వాణిజ్య స్థలాలకు ప్రకటించిన రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా స్కీమ్ ను మసీదులకూ వర్తింప జేసుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పలు ప్రాంతాల్లోని షాపులు, గృహాలు నాటి ఘటనల్లో ధ్వంసమయ్యాయని, వాటికి ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. గోద్రా ఘటన తరువాత 500 మసీదులు ధ్వంసం కాగా, వాటి పునర్నిర్మాణానికి నిధులు ఇవ్వాలని గతంలో హైకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News