: రెచ్చిపోతున్న ఉత్తరకొరియా.. జపాన్‌ మీదుగా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం

ఉత్తర కొరియా మరోమారు రెచ్చిపోయింది. దుందుడుకు చర్యలతో నిత్యం ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఉత్తర కొరియా తాజాగా మరో బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. ఇది జపాన్ మీదుగా ప్రయాణించి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో పడింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో కిమ్‌ జోంగ్ తాజా చర్య అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి 550  కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర జపాన్ దీవి అయిన హొక్కైడో మీదుగా 2700 కిలోమీటర్లు ప్రయాణించినట్టు ఉత్తర కొరియా అధికారులు తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ శక్తిసామర్థ్యాలను పరీక్షించుకుంటున్నట్టు తెలిపారు.

ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి కారణంగా తమ ఓడలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని జపాన్ టీవీ పేర్కొంది. క్షిపణి మూడు భాగాలుగా విడిపోయిందని తెలిపింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని అమెరికా కూడా నిర్ధారించింది. ప్రయోగం 90 నిమిషాల్లోనే ముగిసిందని పెంటగాన్ అధికారిక ప్రతినిధి కల్నల్ రోబ్ మానింగ్ తెలిపారు.

More Telugu News