: బాబా ముసుగులో ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు: అత్యాచారాలను వెలుగులోకి తెచ్చిన దివంగత జర్నలిస్టు కుమారుడు అన్షుల్

డేరా సచ్ఛా సౌదా చీఫ్‌, రాక్ స్టార్ బాబాగా పేరొందిన గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌ సమాజానికి శత్రువని, ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని అన్షుల్‌ ఛత్రపతి వ్యాఖ్యానించారు. గుర్మీత్ కు న్యాయస్థానం సరైన శిక్ష విధించిందని ఆయన అన్నారు. గుర్మీత్ రేప్ కేసును వెలుగులోకి తెచ్చిన సిర్సా జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి తనయుడే అన్షుల్ ఛత్రపతి. గుర్మీత్ దారుణాలను వెలుగులోకి తెచ్చినందుకు 2002 అక్టోబర్ 24న రామ్ చందర్ ఛత్రపతిని అత్యంత సమీపం నుంచి ఆయన ఇంటి వద్ద దుండగులు కాల్చి చంపారు.

 అనంతరం గుర్మీత్ చేసిన లైంగిక వేధింపులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని 10 నవంబర్ 2003లో హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో దర్యాప్తు జరిపిన సీబీఐ సాక్ష్యాలు అందజేయడంతో లైంగిక వేధింపుల కేసులో గుర్మీత్‌ కు ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. రామ్ చందర్ ఛత్రపతి హత్యపై సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ 2005 జనవరిలో పంజాబ్, హర్యానా హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో వాదనలు సెప్టెంబర్ 16న జరగనున్నాయి.

More Telugu News