: ఇక వాట్సప్‌లోనూ వెరిఫైడ్‌ అకౌంట్స్‌ సౌలభ్యం!

 సోష‌ల్ మీడియాలో ఎన్నో ఫేక్ అకౌంట్లు ఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. ఏది నిజ‌మైన అకౌంటో తెలుసుకోవ‌డానికి ఇప్ప‌టికే  ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ సంస్థ‌లు వెరిఫైడ్‌ అకౌంట్స్‌ సౌలభ్యం క‌ల్పిస్తున్నాయి. అయితే, వాట్స‌ప్‌లో మాత్రం ఈ సౌక‌ర్యం లేదు. త్వ‌ర‌లోనే ఇందులోనూ ఈ సౌల‌భ్యాన్ని పొంద‌వ‌చ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా దశలో ఉందని ఆ కంపెనీ తెలిపింది.

ఈ సౌల‌భ్యాన్ని బిజినెస్‌ ప్రొఫైల్స్‌కు అందిస్తున్నట్లు చెప్పింది. ఈ క్ర‌మంలో తాము కొన్ని బిజినెస్‌ అకౌంట్లను తనిఖీ చేశామని ఆ అకౌంట్ల‌కు ఇకపై ఆకుపచ్చ బ్యాడ్జ్‌తో పాటు, తెలుపు రంగు టిక్‌మార్కు ఉంటుందని పేర్కొంది. సంబంధిత ప్రొఫైల్ పేరు యూజ‌ర్ల ఫోన్‌బుక్‌లో లేకపోతే ఆ ఖాతా అసలు పేరును కూడా తెలుసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. బిజినెస్‌ ఖాతాకు సంబంధించిన పూర్తి చిరునామా, ఈ-మెయిల్‌, వెబ్‌సైట్‌ వంటి వివరాలు కూడా ఈ కొత్త ఫీచ‌ర్‌లో చూడ‌వ‌చ్చ‌ని తెలిపింది.   

More Telugu News