: గుర్మీత్ కు కేవలం పదేళ్ల శిక్షా?... సిగ్గు చేటు!: బాధితుల మద్దతుదారుల ఆక్షేపణ

రాక్ స్టార్ బాబాగా పేరొందిన రాంరహీం గుర్మీత్ సింగ్ బాబాకు రోహ్ తక్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై బాధితుల మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిగా నిర్ధారణ అయిన తరువాత పదేళ్ల జైలు శిక్ష విధించడమేంటని ప్రశ్నించారు. గుర్మీత్ కు విధించిన శిక్షను వారు కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. శిక్ష విధించడంలో చిత్తశుద్ధి కనిపించడం లేదని వారు ఆరోపించారు. అనామకుడు నిందితుడైతే శిక్ష ఇలా ఉండేది కాదని వారు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ కేసులో చిత్తశుద్ధితో వ్యవహరించలేదని వారు పేర్కొన్నారు. బాధితుల తరపున ఈ శిక్షను ఎలా అంగీకరించగలరని వారు ప్రశ్నించారు. అత్యాచారాలకు ఇలాంటి శిక్షలు విధిస్తే భవిష్యత్ లో అత్యాచారాలు ఆగుతాయా? అని వారు ప్రశ్నించారు. 

More Telugu News