: బాగా చేశావు బ్ర‌ద‌ర్‌: ‘అర్జున్ రెడ్డి’ హీరోపై రానా ప్రశంసల జల్లు

‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరో విజయ్ దేవరకొండపై నటుడు రానా ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ రోజు తాను ‘అర్జున్ రెడ్డి’ సినిమాను చూశాన‌ని, అద్భుతంగా ఉంద‌ని, విజ‌య్‌ దేవ‌ర‌కొండ న‌ట‌న అత్య‌ద్భుత‌మ‌ని పేర్కొన్నాడు. 'బాగా చేశావ్ బ్ర‌ద‌ర్' అని, ఇటువంటి పెర్ఫార్మెన్సే కొన‌సాగించాల‌ని రానా ట్వీట్ చేశాడు. కాగా, అర్జున్ రెడ్డి సినిమాపై టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా నేచుర‌ల్‌గా ఉంద‌ని, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని కొనియాడుతున్నారు. 

More Telugu News