akhil: 'హలో' టైటిల్ ఆలోచన నాగార్జునదేనట!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండవ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'హలో' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ చాలా క్యాచీగా ఉండటంతో, జనంలోకి దూసుకుపోయింది. ఈ టైటిల్ పెడితే బాగుంటుందని సూచించినది నాగార్జునేనట.

ఈ సినిమాలో కథానాయికతో 'హలో' అని చెప్పించుకోవడం కోసం కథానాయకుడు తెగ తాపత్రయ పడుతూ ఉంటాడట. అందువలన 'హలో' అనే టైటిల్ పెడితేనే యాప్ట్ గా ఉంటుందని నాగార్జున అన్నారట. విక్రమ్ కుమార్ కి కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఈ టైటిల్ యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో నాగార్జున హ్యాపీగా వున్నారని చెబుతున్నారు. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.   

More Telugu News