: రేపిస్ట్ బాబా గుర్మీత్‌కు నేడు శిక్ష ఖరారు.. హరియాణాలో హై అలర్ట్.. జైలుకే వెళ్లనున్న న్యాయమూర్తి!

మహిళా సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ సింగ్ (50)ను దోషిగా తేల్చిన న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో హరియాణాలో హై అలెర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రేపటి వరకు ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుంది. ఇక శిక్షను ప్రకటించేందుకు న్యాయమూర్తి హెలికాప్టర్‌లో నేరుగా రోహ్‌తక్ జైలుకు వెళ్లనున్నారు. గుర్మీత్‌ను దోషిగా ప్రకటించిన అనంతరం హింస చెలరేగడంతో అప్రమత్తమైన పంజాబ్ ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేస్తోంది.

ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జైలులోనే శిక్ష ఖరారు చేయడం మేలని భావించిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగ్‌దీప్ నేరుగా జైలుకే వెళ్లనున్నారు. ఇందుకోసం జైలులో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు శిక్ష ఖరారైన అనంతరం హరియాణాలో హింస చెలరేగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా, 2002 నాటి అత్యాచారం కేసులో శుక్రవారం గుర్మీత్‌ను దోషిగా ప్రకటించిన తర్వాత చెలరేగిన హింసలో 38 మంది మృతి చెందారు.

 

More Telugu News