: సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇవ్వడమే కాదు, గెలిపించే బాధ్యతా నాదే: సీఎం కేసీఆర్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గ్రామస్థాయి రైతు సంఘాల ఏర్పాటు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి  పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వడమే కాదు, వారిని గెలిపించే బాధ్యత కూడా తనదేనని అన్నారు. ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకం కావాలని సూచించారు.

 రైతు సంఘాలు ఏర్పాటు చేసే వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు రావద్దని సూచించిన కేసీఆర్,వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణిలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపునకు పార్టీ ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాలని సూచించారు. రైతు సంఘాల ఏర్పాటులో ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించారు. భూ సమగ్ర సర్వే ద్వారా బినామీకి అడ్డుకట్ట వేయనున్నామని, వచ్చే నెల 9నుంచి గ్రామసభలు  ఏర్పాటు చేసి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు సిద్ధం కావాలని సూచించారు.

More Telugu News