tapsee: దెయ్యం కంటెంట్ కు తిరుగులేదంతే .. భారీ రేటుకు 'ఆనందో బ్రహ్మ' శాటిలైట్ హక్కులు

దెయ్యం సినిమా అనగానే అందరిలో ఒక రకమైన ఆసక్తి మొదలవుతుంది. భయం అంటూనే చాలామంది చూసేస్తుంటారు .. అదో థ్రిల్ .. అంతే. ఈ కారణంగానే దెయ్యం సినిమాలు చాలా వరకూ సక్సెస్ ను సాధిస్తూ ఉంటాయి. తాజాగా ఆ జాబితాలో 'ఆనందో బ్రహ్మ' చేరిపోయింది. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు వారు 3. 25 కోట్లకి కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడి శాటిలైట్ రూపంలో తిరిగి వచ్చేయడం విశేషం. లాంగ్ రన్ లో ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టవచ్చనీ, ఇప్పటికే నిర్మాతలకి 5 కోట్ల వరకూ లాభాలు వచ్చేశాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి .. పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాల జాబితాలో, 'ఆనందో బ్రహ్మ' స్థానం సంపాదించుకుందని చెబుతున్నారు.    

More Telugu News