sai dharam tej: మాస్ కథలకు కాస్త దూరంగా సాయిధరమ్ తేజ్!

మొదటి నుంచి కూడా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే ధ్యేయంగా సాయిధరమ్ తేజ్ ఆ తరహా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆరంభంలో ఈ తరహా కంటెంట్ చిత్రాలు ఆయనకి సక్సెస్ లనే తెచ్చి పెట్టాయి. మాస్ ఆడియన్స్ కూడా ఆయనని తమ హీరోగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ఆ తరువాత మాస్ కంటెంట్ తో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరుత్సాహ పరుస్తూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తేజు ఆలోచనలో పడ్డాడు. నాని .. శర్వానంద్ మాదిరిగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడట. అందుకే కొత్తగా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలనే ప్రయత్నంలో భాగంగానే ఆయన కరుణాకరన్ సినిమాను అంగీకరించాడని అంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా తక్కువగా వుండాలని తేజు ముందే చెప్పాడట. రూట్ మార్చడం ఆయనకి కలిసొస్తుందేమో చూడాలి.   

More Telugu News