pavan: పవన్ పుట్టినరోజున ఆయన ఫస్టు లుక్ డౌటే!

త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ను ఫారిన్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పవన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ ను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం.

ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అలాంటప్పుడు సెప్టెంబర్ లో ఫస్టు లుక్ ను వదిలితే .. అప్పటి నుంచి ఈ సినిమా నుంచి ఏదో ఒక స్టఫ్ ను వదులుతూ రావలసి ఉంటుంది. అలా నాలుగు నెలల పాటు చేయడం కష్టం కనుక, కాస్త ఆలస్యంగానే ప్రమోషన్స్ మొదలుపెడదామని నిర్ణయించుకున్నారట. ఈ కారణంగానే సెప్టెంబర్ 2న ఫస్టు లుక్ ను రిలీజ్ చేయాలనే నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెబుతున్నారు.   

More Telugu News