: 'నానో'తో నష్టాలే... ప్రత్యామ్నాయం చూస్తున్నామన్న టాటా మోటార్స్

'నానో' రూపంలో కేవలం లక్ష రూపాయలకే కారును అందించిన టాటా మోటార్స్, ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో ఉంది. ఈ కారుకు అతి తక్కువ మార్జిన్లు మాత్రమే వస్తుండటంతో నష్టపోతున్నామని భావిస్తున్న సంస్థ, నానో కార్ల తయారీ నిలిపివేసి, బ్యాటరీ ఆధారిత నానో కార్లను తయారు చేయాలని భావిస్తోంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వర్షన్ నానో విడుదలవుతుందని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీశ్ బొర్వాంకర్ తెలిపారు.

నానో తయారీ తమకు లాభదాయకంగా లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, లక్షకే కారును అందించామన్న తృప్తి తమకు మిగిలిందని, షేర్ హోల్డర్లలో ఉన్న సెంటిమెంట్ ను తాము నిలుపుకుంటామని తెలిపారు. అయితే, నానో అమ్మకాలతో సంస్థ లాభపడేలా చూడటమే లక్ష్యంగా ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం నెలకు 1000 నానో యూనిట్లను అమ్ముతున్నామని అన్నారు.

More Telugu News