: ఇలాగేనా జగన్ కు ఆహ్వానం పలికేది?: చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించిన వైకాపా

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్మానం చేయాలని నిర్ణయించుకున్న వేళ, విపక్ష నేత వైఎస్ జగన్ హాజరుకాకపోవడం చర్చకు దారితీయగా, తమ నేతకు సరైన రీతిలో ఆహ్వానం అందలేదని వైకాపా విరుచుకుపడింది. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమానికి ఆహ్వానం పంపినట్టే పంపి, రావాల్సిన అవసరం లేదన్న సంకేతాలను ప్రభుత్వం ఇచ్చిందని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

 ఒకరోజు ముందు, అది కూడా సాయంత్రం మాత్రమే ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానాన్ని పంపించారని ఆరోపించారు. సన్మానానికి జగన్ హాజరుకాకున్నప్పటికీ, ప్రతి సందర్భంలోనూ తాము వెంకయ్యకు మద్దతిచ్చామని, వెంకయ్య సైతం జగన్ ను ప్రత్యేకంగా అభినందించారని అన్నారు. కాగా, గత మూడు నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్న జగన్, నేటి నుంచి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వైకాపా వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం రాజమహేంద్రవరం చేరుకునే జగన్, అక్కడి నుంచి కాకినాడకు వచ్చి, ఉదయం 10.3 గంటలకు అన్నమ్మ ఘాట్ వద్ద తొలి సభలో ప్రసంగిస్తారు.

More Telugu News