: నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ కు భారీ భద్రత ఏర్పాటు చేశాం: జిల్లా ఎస్పీ

నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ నెల 28న జరగనుంది. స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ బలగాలు, ఏపీఎస్పీ బలగాలను బందోబస్తు కోసం నియమించినట్టు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టీ తెలిపారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా మొబైల్ పార్టీలు, పికెట్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

కౌంటింగ్ బందోబస్తులో ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 38 మంది ఎస్సైలు, 74 మంది ఏఎస్సైలు, 260 మంది కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా కానిస్టేబుళ్లు, 44 సెక్షన్ల ఏఆర్ సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ బలగాలు, 5 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

More Telugu News