trivikram: పవన్ సినిమా ఓవర్సీస్ హక్కులు 21 కోట్లు?

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగతా భాగం షూటింగ్ కోసం ఈ సినిమా టీమ్ త్వరలో విదేశాలకు వెళ్లనుంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ వ్యవహారం ఫిల్మ్ నగర్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 త్రివిక్రమ్ సినిమాలకి ఓవర్సీస్ లో మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ఇక త్రివిక్రమ్ .. పవన్ కాంబినేషన్ మూవీ అంటే డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు ఓవర్సీస్ హక్కులను 21 కోట్లకు అమ్మడానికి సిద్ధపడ్డారు. బ్లూ స్కై సంస్థ వారు 19 కోట్లకి బేరమాడినా ప్రయోజనం లేకుండా పోయిందట. దాంతో 20 కోట్లు అవుట్ రేట్ .. 1 కోటి రికవరబుల్ ఎమౌంట్ గా ఇచ్చేందుకు బ్లూ స్కై వారు అంగీకరించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇరుపక్షాల వారు సిద్ధమవుతున్నారట.    

More Telugu News