kalyan ram: మొత్తానికి తమన్నా తెలుగులో ఓ ఛాన్స్ పట్టేసింది!

తెలుగులో అగ్ర కథానాయకుల సరసన వరుస సినిమాలను చక్కబెట్టిన తమన్నాకు ఇప్పుడు ఇక్కడ గట్టి పోటీ ఎదురవుతోంది. దాంతో ఆమె చేతిలో ఇంతవరకూ ఒక్క తెలుగు సినిమా కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు నుంచి ఆమెకి ఒక ఛాన్స్ వెళ్లింది.

 కల్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు జయేంద్ర సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కల్యాణ్ రామ్ చేస్తున్న 'ఎమ్మెల్యే' పూర్తి కాగానే, ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను సంప్రదించగా .. ఓకే చెప్పేసిందట. 'బాహుబలి' తరువాత మరింత దూసుకుపోతుందనుకున్న తమన్నాకి అవకాశాలు తగ్గడం ఆశ్చర్యమే.  

More Telugu News