: ఉత్తర కొరియాకు సవాల్.. యుద్ధ విన్యాసాలను చేపట్టిన జపాన్!

ఉత్తర కొరియా నిర్వహిస్తున్న వరుస క్షిపణి పరీక్షలతో జపాన్ వణికిపోతున్న సంగతి తెలిసిందే. కిమ్ జాంగ్ ప్రయోగిస్తున్న క్షిపణులు జపాన్ సముద్రంలోనే పడుతున్నాయి. దీంతో, జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, జపాన్ కూడా జూలు విదిల్చింది. ఉత్తర కొరియాకు దీటుగా మౌంట్ ఫ్యూజీ ప్రాంతంలో యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది.

లైవ్ ఫైర్ డ్రిల్స్ ను నిర్వహిస్తోంది. ఈ విన్యాసాల్లో 2,400 మంది సైనికులు పాల్గొంటున్నారు. యుద్ధ ట్యాంకులు, నూతనంగా అభివృద్ధి చేసిన క్షిపణులను పరీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జపాన్ సైనికాధికారులు మాట్లాడుతూ, తమ ఆయుధాల పనితీరు బాగుందని... ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా తాము సిద్ధమేనని చెప్పారు. ఉత్తర కొరియా చేపడుతున్న ఖండాంతర క్షిపణులతో తమకు ఎలాంటి ముప్పు లేదని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News