Nayan: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  తెలుగు, తమిళ భాషల్లో తన కెరీర్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న ప్రముఖ నటి నయనతార తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నయ్ లో మొదలైంది. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
*  మహేశ్ బాబు నటిస్తున్న 'స్పైడర్' చిత్రంలోని చివరి పాట చిత్రీకరణ కోసం యూనిట్ రొమేనియాకు వెళ్లింది. మహేశ్, రకుల్ జంటపై ఈ పాటను అక్కడి అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తారు. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 27న రిలీజ్ చేస్తారు.
*  'క్షణం' చిత్రంతో పేరు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు త్వరలో ఓ ఇంటివాడవుతున్నాడు. డబ్బింగ్ ఆర్టిస్టు వీణను ఆయన వివాహమాడుతున్నాడు. ప్రముఖ గాయకుడు ఘంటసాల మనవరాలు, ఘంటసాల రత్నకుమార్ కూతురు అయిన వీణ పలువురు కథానాయికలకు డబ్బింగ్ చెబుతుంటుంది. నవంబర్ 11న వీరి వివాహం జరుగుతుంది. 

More Telugu News