: పంచకులలో పోలీసుల కాల్పులు, ఐదుగురి మృతి.. ఆ ప్రాంతానికి అదనంగా 600 మంది సైనికుల తరలింపు

డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్ దోషి అని హ‌ర్యానాలోని పంచ‌కుల సీబీఐ కోర్టు తీర్పునిచ్చిన నేప‌థ్యంలో పంజాబ్, హ‌ర్యానాల్లో హింస చెలరేగుతోంది. హర్యానాలోని పంచకులలో ఆందోళ‌న‌కారుల‌పై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఐదుగురు మృతి చెందారు. పంచ‌కుల ప్రాంతానికి అదనంగా 600 మంది సైనికులను తరలించారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో నిఘా కొనసాగిస్తున్నారు.

 పంచకులలో ఆదాయపన్ను శాఖ ఆఫీసు, షాపింగ్‌ మాల్‌, ధియేటర్లపై ఆందోళ‌న‌కారులు దాడుల‌కు దిగారు. హోటల్‌ హాలీడే ఇన్‌ వద్ద నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చెల‌రేగింది. మ‌రోవైపు ఆందోళ‌న‌కారుల నిర‌స‌న దేశ రాజ‌ధాని ఢిల్లీని కూడా తాకింది. అక్క‌డ రెండు వాహ‌నాల‌కు ఆందోళ‌న‌కారులు నిప్పుపెట్టారు. ఢిల్లీలోని రైల్వే స్టేషన్లు, సరిహద్దుల్లో భద్రతను పెంచారు.  

More Telugu News