: `క్వీన్‌` రీమేక్‌లో కాజ‌ల్‌... ఫైన‌ల్ చేసిన చిత్ర‌యూనిట్‌!

హిందీలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న కంగ‌నా ర‌నౌత్ `క్వీన్‌` సినిమా తెలుగు, తమిళ రిమేక్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుంది. మొద‌ట ఈ పాత్రలో త‌మ‌న్నా న‌టిస్తుందన్న వార్త‌లు వ‌చ్చాయి. త‌ర్వాత ఆమె స్థానంలో అమ‌లా పాల్‌ను తీసుకున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ ఇద్ద‌రు భామ‌లు త‌ప్పుకోవ‌డంతో క్వీన్ పాత్ర కాజ‌ల్‌ను వ‌రించింది. ఇప్ప‌టికే తెలుగులో `నేనే రాజు నేనే మంత్రి`, త‌మిళ్‌లో `వివేగం` సినిమాల విజయాలు కాజ‌ల్ ఖాతాలో ప‌డ్డాయి. ఇక క్వీన్ పాత్ర ద్వారా మ‌రో విజ‌యం సొంతం చేసుకునే అవ‌కాశాలున్నాయ‌ని సినీవ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. `క్వీన్‌` చిత్రాన్ని ద‌క్షిణాది ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లుగా రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News