: మళ్లీ వచ్చేసిన నీలేకని.. సొంతగూటికి చేరిన కో-ఫౌండర్.. ఊపిరి తీసుకున్న ఇన్ఫోసిస్!

సంక్షోభంలో చిక్కుకున్న ఇన్ఫోసిస్‌కు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కొత్త ఊపిరిలూదారు. ఆయన తిరిగి  సొంత గూటికి చేరుకున్నారు. ఇన్వెస్టర్లు, ఇతర సహ వ్యవస్థాపకుల ఒత్తిడి మేరకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. దీంతో ఇన్ఫోసిస్‌లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ప్రస్తుత చైర్మన్ ఆర్.శేషసాయి స్థానంలో నీలేకని బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు.

కాగా, గురువారం సమావేశమైన ఇన్ఫీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సహ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రవి వెంకటేశన్ ఇకపై స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఇక, గతవారం రాజీనామా చేసిన విశాల్ సిక్కా బోర్డు నుంచి తప్పుకున్నారు. యూవీ ప్రవీణ్‌రావు సీఈవో, ఎండీగా కొనసాగుతారు. సంస్థలో నెలకొన్న తాజా పరిణామాలను వివరించేందుకు నేడు (శుక్రవారం) ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నట్టు ఇన్ఫోసిస్ పేర్కొంది.  సొంతగూటికి తిరిగి చేరుకోవడంపై నందన్ నీలేకని మాట్లాడుతూ ఇన్ఫోసిస్‌కు తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు.

More Telugu News