: అమెరికాలో కాల్పుల కలకలం.. రెస్టారెంట్ ఉద్యోగి బీభత్సం.. బందీలుగా పలువురు!

అమెరికాలో మరోమారు తుపాకి గర్జించింది. తీవ్ర అసంతృప్తికి గురైన రెస్టారెంట్ ఉద్యోగి ఒకరు రెస్టారెంట్ లో కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా  మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ లో జరిగిందీ ఘటన. దుండగుడి అదుపులో మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం వర్జీనియాస్  అండ్ కింగ్  రెస్టారెంట్ లో తాము భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

50 ఏళ్ల వయసున్న వ్యక్తి ఒకరు కిచెన్ లోనుంచి బయటకు వచ్చి బీభత్సం సృషించాడని పేర్కొన్నారు. చూడ్డానికి నల్ల జాతి వ్యక్తిలా ఉన్నాడని, నగరానికి కొత్త బాస్ వచ్చాడని పెద్దగా అరుస్తూ కాల్పులు జరిపినట్టు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని నగర మేయర్ అన్నారు. అతడి అదుపులో ఎంత మంది ఉన్నదీ తెలియరాలేదని, బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు చెప్పారు. కాల్పులు జరిపింది రెస్టారెంట్ అసంతృప్త ఉద్యోగి అని మేయర్ వివరించారు.

More Telugu News