: బిగ్‌బాస్ హౌస్ లోకి ‘అర్జున్ రెడ్డి’?

సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న బిగ్‌బాస్ షోకు మంచి స్పంద‌న వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీంతో సినిమా రిలీజ్ స‌మ‌యంలో త‌మ చిత్రాల‌ను ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం కోసం ఈ షోలో పాల్గొన‌డానికి కొత్త సినిమాల యూనిట్లు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇప్ప‌టికే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా రానా కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్ర‌చారం కోసం ఆ చిత్ర బృందం ఈ షోలో పాల్గొనాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఇందు కోసం వారు ‘బిగ్‌బాస్’ నిర్వాహ‌కుల‌ను సంప్ర‌దించి, అదే ప‌నిలో బిజీబిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం. 

More Telugu News