balakrishna: తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ!

బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగులో నయనతార జాయినైంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది తాజా సమాచారం.

తండ్రిగా .. కొడుకుగా ఆయన విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సీనియర్ బాలకృష్ణ భార్య పాత్రలో నయనతార కనిపిస్తుందట. ఆమె కాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయికలు ఉంటారని సమాచారం. ఆ కథానాయికల ఎంపికకి సంబంధించిన పనులు జరుగుతున్నాయట. త్వరలోనే వాళ్ల పేర్లను వెల్లడించే ఛాన్స్ వుంది.   

More Telugu News