ajith: 'వివేగం'తో కాజల్ కి హిట్ పడిందండోయ్!

అజిత్ హీరోగా చేసిన 'వివేగం' .. ఈ రోజున భారీ స్థాయిలో తమిళనాట విడుదలైంది. ఈ సినిమాకి అక్కడ హిట్ టాక్ వచ్చేసినట్టు తెలుస్తోంది. అజిత్ అభిమానులకు ఈ సినిమా ఒక రేంజ్ లో నచ్చేసిందట. ఈ సినిమా హిట్ కావాలని కాజల్ ఎంతగానో కోరుకుంది. అలాగే ఆమెకి అక్కడ ఈ సినిమా హిట్ తెచ్చి పెట్టేసిందని అంటున్నారు.

 తెలుగులోను ఈ సినిమా ఈ రోజునే 'వివేకం' పేరుతో విడుదలైంది. ఈ సినిమా ఇక్కడ హిట్ అయితే కాజల్ ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు అవుతుంది. అయితే అది ఎంతవరకూ సాధ్యమనేది చూడాలి. తమిళంలో మాత్రం దర్శకుడు శివకి .. అజిత్ కి  ఇది మూడవ సినిమా కనుక, వాళ్లిద్దరి ఖాతాలో హ్యాట్రిక్ హిట్ నమోదైపోయింది. అజిత్ న్యూ లుక్ .. భారీ యాక్షన్ సీన్స్ .. ఆశ్చర్యచకితులను చేసే విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పుకుంటున్నారు.     

More Telugu News