: 200 మంది మిలిటెంట్లను హతమార్చిన రష్యా... సిరియాలో బాంబుల మోత

సిరియాలోని డిర్‌ ఎల్‌ జోర్‌ పట్టణం బాంబుల మోతతో దద్దరిల్లింది. మోసూల్, అల్ రక్కా నగరాలను అమెరికా, రష్యా సాయంతో సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు డిర్ ఎల్ జోర్ పట్టణానికి చేరుకున్నారు. ఆ పట్టణంలో భారీ ఎత్తున ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న రష్యా వైమానిక దళం విరుచుకుపడింది. గురి చూసి లక్ష్యాలను ఛేదించింది.

ఈ మెరుపుదాడిలో సుమారు 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారని రష్యా ప్రకటించింది. సిరియా సేనలకు సహకారంగా డిర్‌ ఎల్‌ జోర్‌ పట్టణంలో ఐసిస్‌ ఉగ్రవాదుల స్ధావరాలను ముక్కలు చేసి, వారిని మట్టుబెట్టినట్లు తెలిపింది. ఈ నెలలో ఇప్పటి వరకు తమ బలగాలు సిరియాలో 800 మంది ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయని రష్యా తెలిపింది. దీంతో అంతర్యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి ఉగ్రవాదులు వెళ్లకుండా అడ్డుకున్నామని రష్యా తెలిపింది. 

More Telugu News