: అమెజాన్ కు పోటీగా ఒకటైన గూగుల్, వాల్ మార్ట్... తెరపైకి తొలిసారి వాయిస్ షాపింగ్ అనుభూతి!

మీకు కావాల్సిన దుస్తులను వాయిస్ కమాండ్ ద్వారా సెలక్ట్ చేసుకోగలిగితే... "38 ఇంచెస్ లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్" అని స్మార్ట్ ఫోన్ ముందు చెప్పగానే, వివిధ కంపెనీల జీన్స్ వెరైటీలు కళ్లముందు కనిపిస్తే... "పింక్ కలర్ లెగ్గింగ్స్" అనగానే పలు బ్రాండ్ల లెగ్గింగ్స్ స్క్రీన్ పై ప్రత్యక్షమైతే... ఇదే నిజం కాబోతోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు పోటీగా, గూగుల్, వాల్ మార్ట్ కలసి వినూత్న వాయిస్ షాపింగ్ అనుభూతిని అందించాలని నిర్ణయించాయి.

వాల్ మార్ట్ లో షాపింగ్ చేసేవారికి వాయిస్ అనుభూతిని గూగుల్ అందించనుంది. సెప్టెంబర్ నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామని, గూగుల్ అసిస్టెంట్ సహకారంతో లక్షలాది ప్రొడక్టులను అందుబాటులో ఉంచనున్నామని వాల్ మార్ట్ ఈ-కామర్స్ విభాగం హెడ్ మార్క్ లారే వెల్లడించారు. జెట్ డాట్ కామ్ ను కొనుగోలు చేసిన తరువాత మార్క్ లారే కంపెనీలో చేరి, ఆపై వాల్ మార్ట్ విస్తరణకు పలు ప్రణాళికలు రూపొందించారు.

More Telugu News