: యెమెన్ ను కుదిపేస్తున్న కలరా... 2 వేల మంది మృతి, 5.30 లక్షల మందికి వ్యాధి

యెమెన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కలరా వ్యాధి బారిన పడి ఇప్పటివరకూ 2 వేల మందికి పైగా మరణించగా, 5.30 లక్షల మందికి వ్యాధి సోకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. దేశంలో మంచి నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదని, కలుషిత నీటిని తాగి ఏప్రిల్ నుంచి వ్యాధి బారిన పడిన వారి లెక్కలంటూ, తాజా నివేదికను డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

 ఏప్రిల్ 27న తొలి కేసు నమోదు కాగా, ఆగస్టు 20 నాటికి 2 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారని, 5,37,322 కేసులు నమోదయ్యాయని తెలిపింది. యెమెన్ లోని 23 ప్రావిన్స్ లలో 22 ప్రావిన్స్ లలో కలరా వ్యాధి అధికంగా ఉందని తెలిపింది. కొత్తగా వ్యాధి వ్యాపిస్తున్న జిల్లాల సంఖ్య అధికంగా ఉండటం ఆందోళనలను పెంచుతోందని, పరిశుభ్రత పాటించకపోవడం, మురుగు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నష్టం ఎక్కువగా ఉందని అభిప్రాయపడింది.

More Telugu News