: ఆకాశంలో నారింజ రంగు మేఘం... హడ‌లిపోయిన బ్రెజిల్ ప్ర‌జ‌లు... వీడియో చూడండి!

నిర్మ‌లంగా ఉన్న ఆకాశంలో అక‌స్మాత్తుగా ఏర్ప‌డిన నారింజ రంగు మేఘాన్ని చూసి బ్రెజిల్ ప్ర‌జ‌లు వ‌ణికిపోయారు. `ఏదైనా ఉప‌ద్ర‌వానికి ఇది సంకేతమా? ఉల్కాపాతం జ‌ర‌గ‌బోతోందా?` అంటూ ఊహాగానాలు మొద‌లు పెట్టారు. బాణం ఆకృతిలో ఆకాశంలో ఐదు నిమిషాల పాటు క‌నిపించిన ఈ మేఘం బ్రెజిల్‌లోని టెక్సారియా దె ఫ్రెతాస్ ప్రాంతంలో స్ప‌ష్టంగా క‌నిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను ఆ ప్రాంత ప్ర‌జ‌లు ఇంట‌ర్నెట్‌లో పెట్టారు. అయితే ఇది కేవ‌లం దుమ్ము క‌ణాల వ‌ల్ల ఏర్ప‌డిన మేఘ‌మే అని వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించడంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

More Telugu News