mahesh babu: 'స్పైడర్' ట్రైలర్ ను రెడీ చేస్తోన్న మురుగదాస్

మహేశ్ మూవీ 'స్పైడర్' ను వచ్చేనెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అదే రోజున ఈ సినిమాను తమిళంలోను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక వేదిక ద్వారా మహేశ్ ను అక్కడివారికి పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు.

వచ్చేనెల 9వ తేదీన చెన్నైలో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి .. దాని ద్వారా మహేశ్ ను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ రోజున ఆ వేదికపై ఒక స్పెషల్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం ఆ ట్రైలర్ ను కట్ చేసే పనిలో మురుగదాస్ బిజీగా వున్నాడని అంటున్నారు. ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి.    

More Telugu News