teja: 'ఇంద్ర'లో చిన్న చిరంజీవి హీరో అయ్యాడు!

'ఇంద్ర' సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన ఓ కుర్రాడు తొడ కొట్టగానే .. మెరుపులు వస్తాయి. ఆ సన్నివేశాన్ని .. ఆ కుర్రాడిని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. ఆ కుర్రాడి పేరే తేజ .. ఇప్పుడు అతను హీరో అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు, ఆ తరువాత చదువుపైనే శ్రద్ధ పెట్టాడు. చదువు పూర్తయిన తరువాత మళ్లీ నటనపై దృష్టి పెట్టాడు.

ఈ కుర్రాడిని హీరోగా పెట్టి ఒక సినిమాను నిర్మించడానికి బెక్కెం వేణుగోపాల్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో హరి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. బాలనటులుగా చేసిన చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్లలో ఎక్కువ కాలం నిలబడగలిగింది చాలా తక్కువమందేనని చెప్పాలి. మరి తేజ అయినా హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూడాలి.    

More Telugu News