: చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పై విరుచుకుపడ్డ గంభీర్

టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పై టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ కు జట్టును ఎంపిక చేసిన సందర్భంగా యువరాజ్ ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను వివరిస్తూ ఎమ్మెస్కే చేసిన వ్యాఖ్యలపై గంభీర్ మండిపడ్డాడు. దీనిపై గంభీర్ మాట్లాడుతూ, 'యువీని పక్కకు పెట్టారు. అంతవరకూ ఓకే. మరి యువీకి విశ్రాంతినిచ్చామని అనడమేంటి?' అంటూ గంభీర్ ప్రశ్నించాడు. అంటే యువీ ఏదైనా ఫార్మాట్ లో భారత క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడా? అని అడిగాడు. లేదంటే అసలు యువీని ఎంపిక చేయమని చెబుతున్నారా? ఇంతకీ మీరు 'రెస్ట్' అన్న పద ప్రయోగం చేయడం వెనుక కారణం వివరించాలని డిమాండ్ చేశాడు.

 యువీని వరల్డ్ కప్ లో చూడాలనుకుంటే అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండేవారని అన్నాడు. యువీ పునరాగమనం కోసం, టీమిండియాకు ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ అతనికి రెస్ట్ ఇచ్చామని చెప్పడం వెనుక మతలబు ఏంటని గంభీర్ నిలదీశాడు. పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న యువీకి టీమిండియాలో స్థానం సంపాదించడం కష్టమేనని అన్నాడు. 

More Telugu News