sai dharam tej: 'తొలిప్రేమ'లో పవన్ పాత్రకి దగ్గరగా తేజు : కరుణాకరన్

కరుణాకరన్ పేరు వినగానే యూత్ హృదయాలను దోచుకున్న ప్రేమకథా చిత్రాలు గుర్తుకు వస్తాయి. 'తొలిప్రేమ' వంటి సినిమాలు పదే పదే మనసు తలుపుతడతాయి. అలాంటి కరుణాకరన్ .. సాయిధరమ్ తేజ కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

 ఈ సినిమాలో ప్రేమకి పెద్దపీట వేయడం జరిగిందనీ, అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ కి .. ఫ్రెండ్షిప్ కి కూడా ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని కరుణాకరన్ అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే 'తొలిప్రేమ'లో పవన్ పాత్రకు కొనసాగింపుగా తేజు పాత్ర ఉంటుందంటూ ఆసక్తిని రేకెత్తించారు. ఈ కథ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.  

More Telugu News