: ఏసీ రైల్లో ఎలుక చేసిన పని... బాధితుడికి రూ. 27 వేల పరిహారం!

ఓ వ్యక్తి ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న వేళ, తన సూట్ కేసును ఎలుక ధ్వంసం చేసిందని, తాను ఫిర్యాదు చేస్తే, అధికారులు ఎద్దేవా చేశారని వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం రూ. 27,350ని నష్ట పరిహారంగా బాధితుడికి ఇవ్వాలని తీర్పిచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కేరళలోని అలప్పుళ నుంచి చెన్నైకి 2 టైర్ ఏసీ బోగీలో దేవదాస్ అనే వ్యక్తి ప్రయాణించాడు.

అతను రూ. 12,600 పెట్టి కొనుగోలు చేసిన సూట్ కేసును ఓ ఎలుక కొరికేసిన వైనాన్ని గమ్యస్థానం చేరుకున్న తరువాత గమనించాడు. వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఫోటో తీసి పై అధికారులకు పంపాలని వ్యంగ్యంగా మాట్లాడారు. జరిగిన ఘటనపై ఫోరంను ఆశ్రయించిన అతను, సిబ్బంది నిర్లక్ష్యంతో తాను నష్టపోయానని వాదించాడు. కేసును విచారించిన ఫోరమ్, దక్షిణ రైల్వే అధికారుల పర్యవేక్షణాలోపం కారణంగానే ఇలా జరిగిందని తేల్చి బాధితుడికి నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

More Telugu News