: శరవేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం... ప్రజలకు హెచ్చరికలు జారీ

ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 22 అడుగులుగా ఉండగా, వర్షాలు కురుస్తూనే ఉండటంతో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, దిగువ ప్రాంతాల వారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగువంకలు పొంగి పొర్లుతున్నాయి. కడెంవాగు, లంఖంపూర్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వాగుల పరీవాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంట నీట మునిగింది. ముధోల్, ఎల్మత్, ధర్మాబాద్ వెళ్లే మార్గాల్లో నీరు వంతెనల పైనుంచి ప్రవహిస్తుండగా, రాకపోకలు నిలిచిపోయాయి. రెబ్బన మండలం పసీగాం వద్ద పెద్దవాగు ఉప్పొంగింది. దీంతో కాగజ్ నగర్ నుంచి పసీగాం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

More Telugu News