: భారత్-చైనా సైనికులు కొట్టుకున్నది నిజమే.. బయటకొచ్చిన వీడియో!

దేశం మొత్తం స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోయిన వేళ లడఖ్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ వద్ద భారత్-చైనా సైనికులకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇరు పక్షాల సైనికులు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను ఇండియన్ ఆర్మీ దీటుగా ఎదుర్కొంది. లడఖ్ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించిన మరునాడే అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.  చైనా సైనికులు రాళ్లతో భారత సైనికులపై దాడిచేస్తున్న విషయం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు వర్గాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనని, దీనివల్ల శాంతికి విఘాతం కలుగుతుందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు.

More Telugu News