: కనీస నిల్వ నిబంధన పాటించని వారి నుంచి.. ఎస్బీఐ వసూలు చేసిన మొత్తం ఫైన్‌ రూ.235 కోట్లు!

పాత పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప‌లు నిబంధ‌న‌లు విధించి ఖాతాదారుల నుంచి ఫైన్ వ‌సూలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. మినిమమ్‌ బ్యాలెన్స్ నిబంధ‌న‌లను కఠినతరం కూడా చేసింది. ఆ నిబంధన పాటించ‌ని వారి నుంచి ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో రూ.235.06 కోట్లను రాబట్టింది. ఆ నిబంధ‌న పాటించ‌ని అకౌంట్లు మొత్తం 388.74 లక్షల‌ని పేర్కొంది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన చంద్ర‌శేఖ‌ర్ గౌడ్‌ అనే వ్య‌క్తికి తెలిపింది. ముంబైకు చెందిన బ్యాంకు ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్ త‌న‌కు ఈ వివ‌రాలు తెలిపార‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News